రైతులకు ఎకరాకు లక్ష రూపాయల వరద పరిహారం ఇవ్వాలి *Telangana | Telugu OneIndia

2022-07-26 5

YS Sharmila visited the flood affected areas in Telangana and demanded flood compensation for farmers from TRS party | వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద ముంపుకు గురైన ఆదిలాబాద్ జిల్లా, పెద్దపల్లి జిల్లాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల, వరద బాధితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ఆస్తి నష్టం గురించి బాధితులతో మాట్లాడారు. ఆపై తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్ షర్మిల.కాళేశ్వరం ప్రాజెక్టు లో ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని, కానీ కాళేశ్వరం బ్యాక్ వాటర్ ప్రభావంతో వేల ఎకరాల పంట నష్టం జరిగిందంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు. ఇప్పటికైనా కెసిఆర్ మత్తు నిద్ర వీడి తక్షణం వరద బాధితులకు పరిహారం అందించాలని వైయస్ షర్మిల పేర్కొన్నారు.



#Godavarifloods
#YSSharmila
#Farmers